Premi Viswanath: కార్తికదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ ఎంతలా జనాల్లోకి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇంతలా ప్రజాదరణ పొంది టాప్ సీరియల్ గా నిలవడం తో పాటుగా.. టిఆర్పి లలో కూడా అదిరిపోయే రేటింగ్స్ వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం వంటలక్క (దీపక్క). అసలు దీపక్క లేకపోతే కార్తీక దీపం సీరియలే లేదు అని అనడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఆడపడచు తమ ని వంటలక్క పాత్రలో చూసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో సాధారణ మహిళా ఎటువంటి ఇబ్బందులు పడుతుందో అటువంటి ఇబ్బందులే వంటలక్క పడుతుంది ఈ సీరియల్ లో. వంటలక్క లేకపోతే ఈ సీరియల్ ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా నడుస్తూ ఉండేది కాదు.
పదకొండేళ్లు కష్టపడి.. డాక్టర్ బాబు ఎన్ని కష్టాలు పెట్టినా.. తన ఇద్దరి పిల్లలని పెంచి పెద్ద చేస్తుంది వంటలక్క. ఇదంతా సీరియల్ జరిగిన ముచ్చటయితే రియల్ గా వంటలక్క ఎలా ఉంటుందో తెలుసా..? అసలు చాలా మందికి వంటలక్క (దీపక్క) అసలు పేరు కూడా తెలియదు. అసలు వంటలక్కకి పెళ్లయిందా లేదా..? ఒకవేళ అయితే ఎంతమంది పిల్లలు లాంటి విషయాలు చాలా మందికి తెలియదు.
వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. పుట్టి పెరిగింది అంతా కేరళ లోనే. అయితే ప్రేమీ ప్రేమ వివాహం చేసుకుంది. కేరళకి చెందిన ఒక జ్యోతిష్యుడను పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ బాబుకి సంబందించిన బాగోగులని ప్రేమి విశ్వనాథ్ తల్లి చూసుకుంటుందని ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. కార్తీక దీపం సీరియల్ తో చాలా బిజీ గా ఉండే ప్రేమీ విశ్వనాధ్ హైదరాబాద్ టూ కేరళ, కేరళ టూ హైదరాబాద్ తిరుగుతూనే ఉంటుంది. అలా కార్తీకదీపం సీరియల్ ద్వారా చాలా బిజీ షెడ్యూలతో జీవితాన్ని కొనసాగిస్తోంది దీపక్క.