ఎలా పవన్ కళ్యాణ్.? ఇదెలా సాధ్యం.?

బ్యాక్ టు బ్యాక్.. పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చేస్తున్నాయ్.. ఇకపై అంతా పవన్ కళ్యాణ్ జాతరేనట.! ‘వినోదియ సితం’ రీమేక్ దగ్గర్నుంచి, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ మూడు సినిమాలకు సంబంధించి హంగామా మొదలైపోయింది.

చాలా తక్కువ సమయంలోనే ‘వినోదియ సితం’ సినిమా షూటింగ్‌ని పవన్ కళ్యాణ్ పూర్తి చేసేసుకోగలిగారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మేనమామ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది, ఎడిటింగ్ పనులూ మొదలైపోయాయ్. ‘ఓజీ’ షూటింగ్ జరుగుతోంది, దాన్నుంచి కూడా అప్డేట్స్ రాబోతున్నాయి.

‘హరిహర వీరమల్లు’ సినిమా అప్డేట్స్ మాత్రం రావట్లేదు. సినిమాలన్నీ పూర్తయిపోతే, ఆ తర్వాత పవన్p కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోతారు. ఇక సినిమాల సందడి ఓ వైపు, రాజకీయ సందడి ఇంకో వైపు. కానీ, ఇదెలా సాధ్యమవుతోంది.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.