ఈ బ్రేక్ ఎంతవరకు నాగ్?

కింగ్ అక్కినేని నాగార్జున తన సినిమాల విషయంలో ఎక్కువ టైమ్ గ్యాప్ తీసుకోడు. ఏడాదిలో కనీసం రెండు సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే ఇప్పటి వరకు కెరియర్ ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా నాగార్జునకి సాలిడ్ సక్సెస్ లేదు. ఈ ఐదేళ్ళలో చూసుకుంటే ఒక్క బంగార్రాజు మాత్రమే పర్వాలేదనే స్థాయిలో ఆడింది.

మిగిలిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. గత ఏడాది చివర్లో వచ్చి తీసుకొచ్చిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. కంటెంట్ బాగున్న ఎందుకనో మన తెలుగు ప్రేక్షకులకి ఆ చిత్రం కనెక్ట్ కాలేదు. మూవీ కాస్తా అడ్వాన్స్ మోడ్ లో హాలీవుడ్ తరహాలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎమోషనల్ గా ఆడియన్స్ ని కనెక్ట్ కాకపోవడం వలన ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.

ది ఘోస్ట్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటా అని నాగ్ ముందుగానే చెప్పారు. అయితే ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతోంది. తన కొత్త సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేరు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఓ రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దాని నుంచి ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఇంకా ఆ ప్రాజెక్ట్ ఉంది.

అయితే కింగ్ నాగార్జున ప్రస్తుతం కొడుకుల కెరియర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అలాగే నాగచైతన్య కూడా కస్టడీతో ఫ్లాప్ కొట్టాడు. ఈ నేపథ్యంలో నాగార్జున ముందుగా కొడుకుల కోసం స్క్రిప్ట్ సెలక్షన్ లో ఉన్నారంట. మంచి సబ్జెక్ట్ లతో వారిని ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నారు.

తరువాత తన ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని నాగార్జున భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ ఏడాదిలోనే అఫీషియల్ ఎనౌన్స్ చేసిన రిలీజ్ మాత్రం అనుకున్నట్లు సంక్రాంతికి జరిగే ఛాన్స్ ఉండకపోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాల మాట.