PSPK 27: పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీ అప్ డేట్.. ఈ విషయం తెలిస్తే పవన్ ఫ్యాన్స్ అరుపులే..!!

Hollywood experts to work for pawan kalyan and krish combo movie

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పవన్ బర్త్ డే రోజున మూవీ ప్రీ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులతో పంచుకుంది. ఇది ఒక పీరియాడికల్ డ్రామా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయినా.. కరోనా వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

Hollywood experts to work for pawan kalyan and krish combo movie
Hollywood experts to work for pawan kalyan and krish combo movie

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ పింక్ రిమేక్  వకీల్ సాబ్ లో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టే. ఆ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమాలో పవన్ నటించనున్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్నది.

ఇక.. క్రిష్ డైరెక్షన్ లో రాబోయే ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. అంటే ఈసినిమాలో చాలామటుకు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ గట్రా ఉంటాయి. దాని కోసం… ఏకంగా హాలీవుడ్ నిపుణులనే తీసుకున్నారట. హాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఆక్వామెన్, స్టార్ వార్స్ ఎపిసోడ్ 7, వార్ క్రాఫ్ట్ లాంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట.

అసలే పవన్, క్రిష్ కాంబో.. చారిత్రక నేపథ్యం ఉన్న స్టోరీ, దానితో పాటు.. వీఎఫ్ఎక్స్ కు హాలీవుడ్ నిపుణుడే రంగంలోకి దిగాడంటే ఈ సినిమా మామూలుగా ఉండదు.. అంటూ పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక.. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద రికార్డులను క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇక.. ఈ సినిమాను ఒక తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నారు. దానితో పాటు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే.. పవన్ సరసన.. ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.