హాలీవుడ్ సినిమాకు ఎన్టీఆర్ ఛాయిస్!?

‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విశ్వవ్యాప్తమైంది. నందమూరి అభిమానుల ఆనందం సైతం కాలర్ ఎగిరేసేలా ఎల్లలు దాటింది. హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఎన్టీఆర్ నటనపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండటం, ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తుండటం నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. యాక్టింగ్, డాన్సింగ్ లో రామ్ చరణ్ తో కలిసి ఇరగదీశాడు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ దక్కించుకోవడంతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఎన్టీఆర్ నటనపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండటం, ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తుండటం నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ తన మనసులో మాట చెప్పారు. ఏదో ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఉందంటూ జేమ్స్ గన్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ వాల్యూమ్ 3 డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ మాట చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం అంతాఇంతా లేదు. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ మాట చెప్పారు. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్‌ని పరిచయం చేయాలంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని అడగ్గా.. తారక్ అని బదులిచ్చారు.

దీంతో హాలీవుడ్ సినిమాకు ఇండియా నుంచి ఎన్టీఆర్ ఛాయిస్ కావడం అనేది హాట్ టాపిక్ అయింది. గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం అమెరికా వెళ్ళినప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని ఎన్టీఆర్ చెప్పారు. ఇప్పుడు ఆయనతో పని చేయాలని హాలీవుడ్ దర్శకులు జేమ్స్ గన్ అన్నారు. సో.. చూస్తుంటే మన తెలుగు కెరటం ఎన్టీఆర్ హాలీవుడ్ త్వరలోనే మూవీ ఛాన్స్ పట్టేసినా వింతేమీ లేకపోవచ్చు.

‘త్రిబుల్ ఆర్’ సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు డైరెక్టర్ కొరటాల శివ. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ శక్తివంతంగా ఉంటుందని అన్నారు. దీంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివతో సినిమా కంప్లీట్ అయ్యాక హిందీలో ‘వార్ 2’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో ఆయన కనిపిస్తారని తెలుస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.