బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ‌కు ప‌వ‌న్ కళ్యాణ్ లేఖ‌ !

గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ సినిమాల‌కు దూరంగా ఉన్న అయన క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అభిమానుల సంగ‌తి అటుంచితే సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ అంటే ప‌డిచ‌చ్చిపోతున్నారు. ఆయ‌న నుండి ఏదైన గిఫ్ట్ వ‌చ్చిన లేదంటే ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవకాశం వచ్చినా ఆనందంలో తేలిపోతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ భామ హిమ‌జ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంలో తాను న‌టిస్తున్న‌ట్టు పేర్కొన్న హిమ‌జ ప‌వ‌న్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తెగ మురిసిపోయింది.

ఇవి చూసిన ఆమె అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేశారు. చాలా షార్ట్ టైంలోనే ప‌వ‌న్ సినిమా ఆఫ‌ర్ కొట్టేసావు అంటూ కామెంట్ పెట్టారు. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా మ‌రో అప్‌డేట్ ఇచ్చింది హిమ‌జ. పవన్ కల్యాణ్ తనకు స్వ‌ద‌స్తూరితో రాసిన సందేశాన్ని పోస్ట్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది. ఆ సందేశంలో హిమజ గారికి అన్ని శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్.” అని రాసి ఉంది. దీనికి హిమ‌జ‌.. ఇప్పుడు నా ఫీలింగ్‌ని ఏ పదాలు, ఏ ఎమోజిస్ కూడా వ్యక్తపరచలేవు.. అని పేర్కొంది. ఈ హ‌డావిడి చూస్తుంటే హిమ‌జ .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మానియాలో తేలియాడుతుందని అనిపిస్తుంది. ఇంత‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 27వ సినిమాలో హిమ‌జ పాత్ర ఏంట‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్నిస్తున్నారు.

ప‌వ‌న్- క్రిష్ మూవీ చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. ఇక మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు మేక‌ర్స్. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌తో ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌రుపుకుంటుండ‌గా, ఇందులో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపిస్తార‌ట‌. ఆయ‌న స‌ర‌స‌న శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు.