41 ఏళ్ల వయసులో స్టార్ హీరోలతో.. హీరోయిన్ త్రిష అన్ బిలీవబుల్ మూవీ లైనప్!

1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన జోడి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన నటి, ఆ తర్వాత ఒక స్టార్ హీరోయిన్ అవుతుందని, రెండున్నర దశాబ్దాలుగా వెండి తెర ని ఏలుతుందని ఎవరు ఊహించి ఉండరు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం 41 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ బిజీగా ఉంది ఓ నటి. ఆమె మరెవరో కాదు హీరోయిన్ త్రిష.

అతి చిన్న వయసులోనే కథానాయికగా వెండి తెరకు పరిచయమైంది. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో తీసుకుంటుంది ఈ భామ. ఇటీవల విజయ్ దళపతి సరసన లియో సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న త్రిష మూవీ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఈమె తమిళంలో అజిత్ కి జోడిగా విదాముయార్చి చిత్రంలో నటిస్తుంది. అలాగే మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది, అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ సరసన థగ్ లైఫ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాకుండా మలయాళం లో ఐడెంటిటీ పేరుతో వస్తున్న సినిమాలో కూడా త్రిష హీరోయిన్. మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న రామ్ చిత్రం లో కూడా నటిస్తుంది.

మరొకవైపు సూర్య అప్కమింగ్ మూవీలో కూడా త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా అజిత్ సరసన గుడ్ బాడ్ అగ్లీ అనే మరో సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తూ తెగ బిజీగా ఉంది ఈ భామ. నిజానికి ఆమెతోపాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు చాలామంది ఇప్పటికే కనుమరుగైపోయారు కానీ ఈమె మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోలతో నటిస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకుంటుంది.