పెళ్లి గురించి ప్రచారం అక్కర్లేదనుకున్నాం: తాప్సీ

నటి తాప్సీఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమన్నారు. ‘నా వివాహానికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి పెంచాలని అనుకోవడం లేదు. దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే.

ఈ విషయంలో నా భర్తకు మరో అభిప్రాయం ఉండొచ్చు. అందుకే మేము దీని గురించి విూడియా, సోషల్‌ విూడియాలో చెప్పలేదు. పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి దీనిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. వాళ్ల అంగీకారంతోనే చేసుకున్నాం.

పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆర్భాటాలకు చోటివ్వకుండా కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. భవిష్యత్తులో అందరికీ షేర్‌ చేయాలనుకుంటే అప్పుడు పోస్ట్‌ చేస్తాను’ అని చెప్పారు. మార్చి 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ`మథియాస్‌ బో వివాహం జరిగింది. ఇటీవల వీరి పెళ్లి వీడియో లీకవ్వగా అది వైరల్‌గా మారింది.