Salman Khan – Rashmika: సల్మాన్ తో రష్మిక.. ఈసారి కష్టమేనా?

సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక మందన్నా, ఇప్పుడు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సికందర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ (900 కోట్లు), పుష్ప 2 (1800 కోట్లు), ఛావా (600 కోట్లు) వంటి బ్లాక్‌బస్టర్లతో ఆమె తన స్టార్ స్టేటస్‌ను మరింత పెంచుకుంది. అయితే సికందర్ మాత్రం రష్మిక ఈ విజయ పరంపరను కొనసాగిస్తుందా? లేక సినిమా ఫలితంపై బాలీవుడ్‌లో ఆమె స్థాయిని ప్రభావితం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సికందర్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ అంచనాలే ఉన్నప్పటికీ, మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచే నెగటివ్ టాక్ వినిపిస్తోంది. మురుగదాస్ గత సినిమాల కంటే ఈ కథ అంతా కొత్తగా లేదని, రొటీన్ ఫార్మాట్‌లోనే సాగుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

అలాగే, సల్మాన్ లుక్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగించడంతో సల్మాన్ ఫిజిక్ చాలా నేచురల్‌గా లేదని, ఇది ప్రేక్షకులకు అసహనంగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన జొహ్రా జబీన్ సాంగ్ సినిమాపై ఉన్న నెగటివ్ బజ్‌ను మరింత పెంచింది. ఈ పాటలో రష్మిక గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

యానిమల్, పుష్ప 2, ఛావా వంటి సినిమాల్లో రష్మిక పాత్రలకు మంచి డెప్త్ ఉండగా, సికందర్లో ఆమె కేవలం కమర్షియల్ ఎలిమెంట్‌గా మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది బాలీవుడ్‌లో ఆమె స్టేటస్‌ను ప్రభావితం చేసే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సల్మాన్ ఖాన్ సినిమాలకు బలమైన ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈసారి సికందర్ పై బిల్డ్ అయిన నెగటివ్ టాక్ మొదటి రోజునే ప్రభావం చూపించేలా కనిపిస్తోంది.

ఇంకా సినిమా విడుదలకు మూడు వారాల సమయమే ఉన్నందున, మేకర్స్ ట్రైలర్‌తోనే ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చాలి. రష్మిక ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ స్థాయిని సొంతం చేసుకున్నా, సికందర్ వంటి సినిమాలు ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సికందర్ హిట్ అయితే ఓకే, లేకపోతే రష్మిక బాలీవుడ్ రేంజ్‌కు డ్యామేజ్ అవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Public Reaction On Ys Jagan Comments On Pawan Kalyan | Ap public Talk | Ap Budget | Chandrababu | TR