Rashmika: నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న నటి రష్మిక మందన్న. ఇటీవల నటించిన పుష్ప సినిమాతో తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకొని పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేస్తున్న ఈ భామ ఇటీవల శర్వానంద్‌తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన దారిని కూడా ఏర్పాటు చేసుకుంటోన్న ఈ బ్యూటీ ఇటీవల కాలంలో చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతుండడం విశేషం. కాగా అందరి హీరోయిన్స్‌లాగానే రష్మిక కూడా తన గ్లామర్ ను మెయింటేనేన్స్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే ఫిట్‌నెస్ విషయంలో ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నపుడే కోరుకున్న ఫలితాల్ని సాధిస్తామని రష్మిక చెప్పుకొచ్చింది. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా వర్కవుట్‌ను మాత్రం తప్పని ఈ ముద్దుగుమ్మ కేవలం జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేస్తే సరిపోదని, ఆహార విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తోంద్. ప్రారంభంలో కొంచెం కష్టమైనా, ఒక్కసారి అలవాటు చేసుకుంటే అద్భుతాలు చూడడం ఖాయ అంటోంది ఈ అందాల భామ రష్మిక.