నిధి అగర్వాల్.. తెలుగులో చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. అఖిల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించినా.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తనకు ఫుల్ సక్సెస్ ఇచ్చింది. దీంతో ఈ సుందరికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
ముందు ఐరన్ లెగ్ అని అనిపించుకున్నా.. తర్వాత టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారింది నిధి. తాజాగా నిధి అగర్వాల్ గురించి ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది.
నిధి అగర్వాల్.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందట.. అంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి నిధి అగర్వాల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కొదవ లేదు. దీంతో ఎవరో ఒక యంగ్ హీరోతో నిధి కనెక్ట్ అయి ఉంటుందని సినీ అభిమానులు కూడా అనుకున్నారు. పోనీలే.. ఇవన్నీ ఇండస్ట్రీలో కామనే కదా.. అని కూడా అనుకున్నారు.
కానీ.. తనపై వస్తున్న రూమర్లపై వెంటనే స్పందించింది ఇస్మార్ట్ బ్యూటీ. నా స్టేటస్ ఇంకా సింగిలే. సింగిల్ స్టేటస్ లోనే ఉన్నాను ఇంకా. నేను ఎవరితోనైనా డేటింగ్ లో ఉంటే నేనే కన్ఫమ్ చేస్తా. నేను ఏ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేయడం లేదు.. అంటూ ఫుల్లు క్లారిటీ ఇచ్చేసింది.