ఇన్సైడ్ టాక్ : “NTR30” కి తప్పని హీరోయిన్ కష్టాలు.?

ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. మరి తన లాస్ట్ హిట్ ఆర్ ఆర్ ఆర్ తో ఒక్క పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకోగా ఇప్పుడు అయితే నెక్స్ట్ భారీ సినిమా తన కెరీర్ లో 30వ సినిమా చేస్తున్న దానిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అనౌన్స్ అయ్యి చాలా కాలం దాటినప్పటికీ కూడా ఇంకా హైప్ మాత్రం ఈ సినిమా మీద అలాగే ఉండడం విశేషం. అయితే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఈ సినిమాకి నడుస్తూ ఉండగా ఓ అంశం మాత్రం ఇంకా అలా సస్పెన్స్ గానే నడుస్తుంది. అదే ఈ సినిమా హీరోయిన్ విషయంలో అట.

అయితే హీరోయిన్ గా బాలీవుడ్ నుంచే ఎవరొకరిని తీసుకోవాలని మేకర్స్ చూస్తుండగా గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా దాదాపు ఓకే అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు ఆమెకి ఉన్న కంమిట్మెంట్స్ తో మళ్ళీ ప్రశ్నార్ధకమే అన్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే ఈమె కాకపోయినా సేఫ్ సైడ్ గా ఇంకో హీరోయిన్ చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట.

ఆమె రష్మికా అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యువసుధ ఆర్ట్స్ సహా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.