ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ, ఇంతలోనే హీరోయిన్ ఎవరన్నదానిపై గుసగుసలు గుప్పుమంటున్నాయి.
జాన్వీ కపూర్ కావాలంటున్నాడట మోక్షజ్ఞ.! కాదు కాదు, ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌ని ట్రై చేస్తున్నారట.! వీళ్ళిద్దరూ కాదు, శ్రీలీల ఫైనల్ అయిపోయిందట.! మధ్యలో రష్మిక మండన్న పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ తర్వాత, బాలయ్య పూర్తిగా తన కుమారుడి తెరంగేట్రంపై ఫోకస్ పెడతారట. ‘భగవంత్ కేసరి’ సినిమా రేపే రిలీజ్. రిజల్టుని బట్టి, తన కుమారుడ్ని అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలా.? వద్దా.? అన్నదానిపై బాలయ్య కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకోబోతున్నాడట.
ఇంతకీ, మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీలీల, రష్మిక మండన్న.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హీరోయిన్‌గా మోక్షజ్ఞ సినిమాకి కన్ఫామ్ అయినట్టేనా.? డైరెక్టర్ లెక్క తేలకుండా, హీరోయిన్ల పేర్లు ఎందుకు ఇలా చక్కర్లు కొడుతున్నాయబ్బా.? నిప్పు లేకుండానే పొగ వస్తోందని అనుకోవచ్చా.?