సైలెంట్‌గా ఓటిటిలోకి ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’

హీరో వరుణ్‌ తేజ్‌, మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ . వార్‌ డ్రామా నేపథ్యంలో పాన్‌ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహించాడు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్క ను డెడికేట్‌ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 2న గ్రాండ్‌గా విడుదలైంది.

కాగా ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. కేవలం 20 రోజుల్లోనే పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోకి డిజిటల్‌ డెబ్యూ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టీమ్రింగ్‌ అవుతోంది. త్వరలోనే దక్షిణాది ప్రధాన భాషల్లో రిలీజ్‌ చేసేందుకుప్;ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఇక హిందీ వెర్షన్‌ థియేటర్లలో విడుదలైన తర్వాత 56 రోజులకు డిజిటల్‌ డెబ్యూ ఇవ్వనుంది. ఈ చిత్రంలో నవ్‌దీప్‌, రుహానీ శర్మ, పరేశ్‌ పహుఆ, శతఫ్‌ ఫిగర్‌, సంపత్‌, అలీ రెజా కీలక పాత్రల్లో నటించారు. ఏరియల్‌ డ్రామాగా వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ రాబట్టుకుంటుందో చూడాలి. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటించగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించింది.

వాస్తవ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీని యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్ట్‌ చేశాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌’రెనాయ్‌సెన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై సందీప్‌ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘పలాస 1978’ ఫేం కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ మట్కాలో కూడా చేస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.