వరుస ఫ్లాప్‌లతో వరుణ్‌.. ఫెయిల్యూర్‌ దర్శకులతో సినిమాలకు ఓకే!?

‘ముకుంద’ చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేశాడు మెగా హీరో కొణిదెల వరుణ్‌తేజ్‌. ఆ తరువాత తొలిప్రేమ, ఫిదా వంటి విజయాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇక గద్దల కొండ గణేష్ తో మాస్‌ హీరో అనిపించుకున్న ఈ కొణిదెల వారసుడు ఎఫ్‌-2, ఎఫ్‌-3 చిత్రాలతో మంచి కామెడీ టైమింగ్‌ వున్న హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో వరుణ్‌తేజ్‌ నటించిన ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’, ‘గాండీవధారి అర్జున’ చిత్రాలు బిగ్గెస్ట్‌ ప్లాప్‌ గా నిలిచాయి. దీంతోపాటు వరుస ప్లాప్‌ల తరువాత కూడా ఈ హీరో ఇటీవల ప్లాప్‌ సినిమాలు ఇచ్చిన దర్శకుల సినిమాల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆశ్చర్యంగా వుంది.

ప్రస్తుతం ‘పలాస’ దర్శకుడు కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘మట్కా’ పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ వంటి డిజాస్టర్‌ సినిమాను రూపొందించాడు కరుణ్‌కుమార్‌. దీంతో పాటు వరుణ్‌ మరో రెండు సినిమాలు అంగీకరించాడు. రవితేజతో ‘టచ్‌ చేసి చూడు’ వంటి ప్లాప్‌ సినిమాను తెరకెక్కించిన విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్‌తో మ్యాస్టో చిత్రంతో పాటు లైక్‌ అండ్‌ షేర్‌ వంటి ప్లాప్‌ చిత్రాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. గత మూడేండ్లలో ఎలాంటి హిట్‌లు లేని దర్శకులతో వరుణ్‌ వరుస సినిమాలు చేయడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు సక్సెస్‌ చుట్టు తిరుగుతుంటారు.