సుధీర్ బాబు.. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. నిజానికి సుధీర్ బాబు..సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంత బావ. సూపర్ స్టార్ కృష్ణ సొంత అల్లుడు. అయినప్పటికీ ఏనాడూ సుధీర్ బాబు కృష్ణ నుంచి కానీ.. మహేశ్ బాబు నుంచి కానీ మద్దతు కోరలేదు. తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు.
తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు.. ఇటీవల వి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో వి సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ తో వి సినిమాలో సుధీర్ అదరగొట్టాడు.
ఇక.. అసలు విషయానికి వస్తే.. ఇటీవల సుధీర్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందులోనూ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశారు. నిజానికి మెగా ఫ్యామిలీకి, కృష్ణ ఫ్యామిలీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై సుధీర్ బాబు ఈ కామెంట్లు చేసి ఉంటారు.
నెంబర్ వన్ స్థానాన్ని వదిలేసుకొని..
పవన్ కళ్యాణ్ గురించి, ఆయన సినిమాల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు పవన్ కళ్యాణ్ లో నచ్చే విషయం ఏంటంటే… చాలా మంది సినిమా స్టార్లు… తాము ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాం.. అని అనుకున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కాదనుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. అది చాలదా.. ఆయన ఎంత జెన్యూనో తెలుసుకోవడానికి.
ఆయన నిజాయితీ ఏంటో అక్కడే తెలిసిపోయింది. అంత స్టార్ డమ్ ను, నెంబర్ వన్ హీరో పొజిషన్ ను తృణప్రాయంగా వదిలేసి.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడమే ఆయన నిజాయితీకి నిదర్శనం.. అని సుధీర్ బాబు.. పవన్ కళ్యాణ్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు.
సుధీర్ బాబు.. పవన్ కళ్యాణ్ పై ఇంత పాజిటివ్ గా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానుంతా ఎంతో ఖుషీ అవుతున్నారు. మహేశ్ బాబే కాదు.. ఆయన బావ సుధీర్ బాబు కూడా పవన్ కళ్యాణ్ పై సదుద్దేశంతో ఉండటంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. మహేశ్ సోదరి మంజూల కూడా ఆ మధ్య పవర్ స్టార్ ను ఆకాశానికి ఎత్తారు. నాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ముందుగా మహేశ్ బాబు తో కాకుండా పవన్ తోనే సినిమా తీస్తానంటూ ఆమె అన్నారు.