కొడుకుల కోసం అలా సెట్ చేస్తున్న మాస్ రాజా

మాస్ మహారాజ్ రవితేజ ఫ్యామిలీ నుంచి తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా లాంచింగ్ జరిగింది. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవానికి కె రాఘవేంద్రరావు, నిర్మాత సురేష్ బాబు హాజరు కావడం విశేషం.

ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రవితేజ కొడుకు మహాదేవన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఓ స్టార్ దర్శకుడు ఇప్పటికే రవితేజ కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యతలని తీసుకున్నాడు. దీనికోసం కథ కూడా సిద్ధం చేశాడు. చేసి ఇప్పటికే మాస్ మహారాజ్ కూడా కథ విని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఓ బడ నిర్మాణ సంస్థ ఈ సినిమాని గ్రాండ్ నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాని అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయకపోయిన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. ఇక రవితేజ కొడుకు మహాదేవన్ కూడా హీరోగా పరిచయం కావడానికి కావలసిన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

యాక్టింగ్ తో పాటు డాన్స్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికంటే ముందుగా తన తమ్ముడు రఘు కొడుకు మాధవ్ ని అఫీషియల్ గా పరిచయం చేసే బాధ్యతని రవితేజ తీసుకున్నారు. ప్రేమ కథతో ఈ సినిమాని గౌరీ రోనంకి తెరకెక్కించబోతుంది.

ఇక తనయులను హీరోలుగా పరిచయం చేయడానికి కావాల్సిన ఇన్వెస్టర్స్ ని కూడా రవితేజ ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట. పక్కా ప్లాన్ తో కొడుకులని హీరోగా పరిచయం చేయడానికి కావాల్సిన గ్రౌండ్ ని ముందుగానే రవితేజ రెడీ చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో ఆసక్తికర అంశంగా మారింది.