Pawan Kalyan: ఇద్దరు మెగా హీరోలు ఒక సినిమాలో కలిసి నటించడం కొత్త కాదు. మెగా స్టార్, పవన్, నాగబాబు కలిసి నటించారు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా పలు సినిమాలో కలిసి నటించారు. అయితే ఇప్పుడోక సరికొత్త కాంబినేషన్ మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తోంది అలాగే ఆనందపరుస్తోంది . పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఒకే సినిమాలో కనిపించునున్నారు.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతోంది. ఇక వరుస సినిమాలను పవన్ లైన్ లో పెట్టారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ రీమేక్ సినిమా వైపు మొగ్గుచూపారు. వినోదయ సీతం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాలని తొలుత భావించినా జీ స్టూడియోస్ రంగంలోకి దిగింది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 20రోజులు ఇచ్చారు. ఇక ఇంకో ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. స్క్రీన్ ప్లే,మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ రీమేక్ సినిమా కోసం రాయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రొడక్షన్ హౌస్ ఫార్చున్ ఫోర్స్ సినిమాస్, జీ స్టూడియోస్ తో పాటు లాభాలు పంచుకోనుంది. ఇక పవన్ కళ్యాణ్ 20రోజుల షూటింగ్ కోసం 50కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక జీ స్టూడియోస్ తో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ సైన్ చేసారు.ఇలా వరుస సినిమాలతో పవర్ స్టార్ జోరు పెంచి ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ హిట్ టాక్ తో పవన్ అభిమానులు రచ్చ చేస్తుంటే ఇక వరుస సినిమాలు చేస్తుండటంతో ఇక రచ్చ రచ్చే అందులోనూ మేనల్లుడితో సినిమా చేయనుండడం తో ఇంకా రచ్చ చేయడం ఖాయం.