అడ్డంగా బుక్కైన మంచు హీరో…?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నిఖిల్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్స్ ని అందుకున్నాడు. ఈ క్రమంలో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ సినిమా 2014లో విడుదలై మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తో నిఖిల్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

కార్తికేయ సినిమాకి సిక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరం నటించింది. సినిమా విడుదల తేదీ సమీపించటంతో ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ పనులలో భాగంగా నిఖిల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా వినూత్నంగా సీరియల్స్ లో కూడా కనిపిస్తూ సినిమా అని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ 2 సినిమా విడుదల చేయటానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని వివరించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు తన సినిమా రిలీజ్ చేయడానికి వీలు లేదని అడ్డుపడి అక్టోబర్, నవంబర్ లో విడుదల చేసుకోవాలని సూచించినట్లు వివరించాడు. ఇలా తన సినిమా విడుదల చేయడానికి అడ్డుపడటంతో జీవితంలో మొదటిసారిగా నిఖిల్ కన్నీళ్ళు పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు నిఖిల్ కి అండగా ఉంటానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. దీంతో నేటిజన్స్ నీకే దిక్కులేదు నువ్వు మరొకరికి అండగా ఉంటావా అంటూ విష్ణుని ట్రోల్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.