మనోజ్‌ దంపతులకు పాప!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మంచు మనోజ్‌అభిమానులకు శుభవార్త. మంచు మనోజ్‌ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శనివారం ఉదయం మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో రాసుకోస్తూ.. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. మనోజ్‌ -మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అప్పుడే తనకి ఎంఎం పులి అనే నిక్‌ నేమ్‌ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది.