రానున్న రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్ దగ్గర పెద్ద సెన్సేషన్ హిట్ అవుతుంది అని గట్టి నమ్మకం ఉన్న అతి కొద్ది చిత్రాల్లో రియల్ గా పాన్ ఇండియా క్రేజ్ ని తెచ్చుకున్న స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం “పుష్ప 2” కూడా ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు ఇప్పుడు నుంచే అంచనా వేస్తున్నారు.
మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం అయితే ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుంది అని స్ట్రాంగ్ టాక్ కూడా ఉండగా వీటి అన్నిటికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం సెన్సేషనల్ ఎలివేషన్స్ తో భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే వచ్చిన పోస్టర్ లు వీడియోలు మంచి బజ్ ని కూడా క్రియేట్ చేయగా నటీ నటులు పరంగా కూడా ఈ సినిమా మరింత గ్రాండ్ గా వెళుతుంది.
అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ హీరో కార్తీ కూడా నటిస్తున్నారని రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల నిమిత్తం కార్తీ లాంటి నటుడు డిమాండ్ ఉండడంతో కార్తీకి సుకుమార్ నరేషన్ ఇచ్చారట.
దీనితో కార్తీ ఇంకా ఈ రోల్ కి ఓకే చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఓకే అయితే ఆ రోల్ లో కార్తీ కనిపిస్తాడు అని భోగట్టా. మరి తమిళ్ నుంచి అయితే ఈ స్టార్ నటుడు ఉన్నాడో లేదో అనేది వేచి చూడాలి. మరి ఈ సినిమాలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.