‘భీమా’ విజయం సాధిస్తుంది: గోపీచంద్‌

ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నటుల్లో హీరో గోపీచంద్‌ ఒకరు. అతనిప్పుడు ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్నారు, కె.కె రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ విడుదల వేడుక హన్మకొండ వరంగల్‌ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా కథానాయకుడు గోపీచంద్‌ మాట్లాడుతూ: చాలా రోజుల తర్వాత విూ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను విూ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న విూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని చెప్పారు. ‘భీమా’ సినిమా గురించి చెపుతూ, ఈ సినిమా మొదలుపెట్టడానికి మా కో ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌ గారు కారణం. ఆయనే దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. ‘భీమా’ అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది, ప్రతి సన్నివేశం చాలా బావుటుంది అని చెప్పారు గోపీచంద్‌. ‘నేను సాధారణంగా ఇలా చెప్పను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్‌ చేసిన నిర్మాత రాధమోహన్‌ గారికి ధన్యవాదాలు’ అని చెప్పారు గోపీచంద్‌.

ఈ సినిమాకి సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారని అతన్ని కొనియాడారు గోపీచంద్‌. ఈ ‘భీమా’ సినిమాకి వేరే లెవల్‌ లో సంగీతం కొట్టాడు. అలాగే యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, వెంకట్‌, రవి వర్మ చాలా ఎక్స్‌ ట్రార్డినరీ సీక్వెన్స్‌ ఇచ్చారని చెప్పారు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఫైట్స్‌ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ రాశాడు. తను చాలా మంచి రైటర్‌ అవుతాడు అని తన సినిమా ఈసారి విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా చెప్పారు గోపీచంద్‌.