ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో ‘రాయన్‌’

తమిళ నటుడు ధనుష్‌ ప్రస్తుతం వరుస సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం ధనుష్‌ తన 50వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు ‘రాయన్‌’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా.. మటన్‌ కొట్టు రాయన్‌గా ధనుష్‌ లుక్‌ వైరల్‌ అయ్యింది. ఇక ఇదే సినిమాలో సందీప్‌ కిషన్‌తో పాటు కాళిదాస్‌ జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రబృందం పీచు మిఠాయి అంటూ రొమాంటిక్‌ పాటను విడుదల చేసింది. ఇక ఈ పాటలో సందీప్‌ కిషన్‌, అపర్ణ బాలమురళి రోమాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. విజయ్‌ ప్రకాష్‌, హరిప్రియ కలిసి పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్‌, దుషారా విజయన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.