విజయ్ నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా థియేటర్స్ మూత పడటం తో ఆగిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఏ భాషలోనైనా స్టార్స్ హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. ఆయా హీరోల మార్కెట్ ని బట్టి తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళూ పరంగా భారీ పోటీకి దిగుతుంటాయి. ఇప్పుడు కూడా కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీ కి దిగుతున్నారు. వాళ్ళే ఇలయతలపతి విజయ్ అండ్ శింబు.
లాక్ డౌన్ కారణంగా గత 8 నెలలు సినిమా థియేటర్లు మూసివేసేయడంతో ప్రేక్షకులకు ఓటిటిలకు అలవాటు పడ్డారు. కానీ సినిమా థియేటర్లు మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. కాగా ఎట్టకేలకి కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో 100% సీటింగ్ అనుమతిని ప్రకటించింది. దాంతో ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సినిమాలు రెడీ అయ్యాయి. కాగా ఈ సంక్రాంతికి విజయ్ నటించిన ‘మాస్టర్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా లేదని అందరూ అనుకున్నారు. కానీ శింబు తన సినిమాతో విజయ్ కి పోటీ గా రాబోతున్నాడు. గత కొంతకాలంగా శింబు నటించిన సినిమాలు మన తెలుగులో డబ్ కావడం లేదు. అందుకు కారణం తన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో తెలుగులో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అయితే శింబు తను నటించిన ఈశ్వరన్ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. విజయ్ మాస్టర్ కి పోటీగా శింబు ఈశ్వరన్ రావడం తో శింబు అనవసరంగా విజయ్ సినిమాతో పోటీకి దిగుతున్నాడు… అసలే సక్సస్ లు లేని శింబు కి ఈ పోటి అవసరమా అని కోలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఏ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో.