రామ్‌ చరణ్‌ సినిమాకి మళ్ళీ లీకుల బెడద!

రామ్‌ చరణ్‌ సినిమాకి మళ్ళీ లీకుల బెడద తప్పలేదు. ఇంతకు ముందు అతని సినిమాల నుండి చాలాసార్లు పాటలు లీకు అయినట్టుగానే, ఈసారి కూడా దర్శకుడు శంకర్‌ తో చేస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా నుండి ఒక పాట లీకు అయింది. ఇంతకీ ఇది ఎవరు లీకు చేసి ఉంటారంటే… రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా ‘గేమ్‌ చేంజర్‌’ దీనికి దిల్‌ రాజు నిర్మాత.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలా ఫోటోస్‌ బయటకి వచ్చేసాయి, ఎందుకంటే ఈ సినిమా చాలా షూటింగ్‌ అవుట్‌ డోర్‌ లో జరగడం వలన, అక్కడకి వచ్చే జనాలని కంట్రోల్‌ చెయ్యలేరు. అందుకని చాలామంది మొబైల్స్‌ లో ఫోటోలు తీసి సాంఫీుక మాధ్యమాల్లో పెట్టారు.

అప్పుడు అలా ఫోటోస్‌ లీకు బారినపడింది ఈ ‘గేమ్‌ చెంజర్‌’ సినిమా. అయితే ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద లీకు అయింది ఈ సినిమా నుంచి. అదేంటి అంటే ఈ సినిమాలో ఒక పాట మొత్తం బయటకి వచ్చేసింది. మరి దీనికి బాధ్యులెవరై వుంటారా అని చిత్ర యూనిట్‌ ఆరాతీస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమాకి సంగీతం తమన్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎటువంటి పాటలు ఇంతవరకు విడుదల కాలేదు, కానీ ఒక పాత మొత్తం లీకు అవటంతో చిత్ర యూనిట్‌ అందరూ ఇప్పుడు షాకులో వున్నట్టుగా భోగట్టా.