పవన్ కళ్యాణ్ ప్లాన్ కి అటు జనసైనికులకి ఇటు ఫ్యాన్స్ కి మైండ్ బ్లాకవుతోందట ..?

Pawan Kalyan Janasena Party President

ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ కి పవన్ నటించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. త్వరలో ఈ సీన్స్ కంప్లీట్ చేసి 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు.

Vakeel Saab motion poster: Pawan Kalyan holds Criminal law book and  baseball bat for justice - tollywood

ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెడతారని సమాచారం. ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ఇప్పటికే మొదలైన క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళనుందట. అన్ని అనుకున్నట్టు పూర్తయితే విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి పవన్ డేట్స్ సర్దుబాటు చేసుకొని సూరి సినిమాలో కూడా నటించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాని 2021 లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయట.

అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ 2024 ఎన్నికల లోపు ఈ సినిమాలన్ని కంప్లీట్ చేసి రాజకీయాలలో బిజీ కాబోతున్నారని జనసైనికులు అనుకుంటున్నారు. కాని అభిమానులు మాత్రం ఇకపై గ్యాప్ రాకుండా ఒక వైపు సినిమాలు మరోవైపు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని చెప్పుకుంటున్నారట. మొత్తానికి పవర్ స్టార్ అటు జనసైనికులని ఇటు ఫ్యాన్స్ ని షాకింగ్ సర్‌ప్రైజెస్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.