రికార్డ్ మేకర్ రజినీ..”జైలర్” ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ వసూళ్లు ఇవే.!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కన్నడ నుంచి అలాగే మలయాళం నుంచి స్టార్ హీరోస్ మోహన్ లాల్ అలాగే శివ రాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రమే “జైలర్”.

మరి రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా చాలా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతా వస్తుండగా ఆల్రెడీ కమల్ హాసన్ “విక్రమ్” లైఫ్ టైం వసూళ్లు కూడా దాటేసింది అంటూ పలు రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి.

కానీ ఇప్పుడు చిత్ర నిర్మాతలే స్వయంగా జైలర్ మొదటి వారం వసూళ్ళని అయితే రివీల్ చేసారు. వారి నంబర్స్ ప్రకారం ఐతే ఈ చిత్రం మొదటి వారంలో 400 కోట్లు కాదు కేవలం 375.40 కోట్లా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిపారు. అయితే ఇది ఇంకా తమకి వచ్చిన అంచనా వసూళ్లు మాత్రమే అని కొంచెం అటు ఇటుగా ఉండొచ్చని తెలిపారు.

అలాగే మొదటి వారం వసూళ్లు ఐతే కోలీవుడ్ హిస్టరీ లోనే హైయెస్ట్ వసూళ్లు జైలర్ ఇప్పుడు నమోదు చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో రికార్డు మేకర్ రజినీ ఫస్ట్ వీక్ అదరగొట్టగా ఇంకా అయితే విక్రమ్ వసూళ్ళని బ్రేక్ చేయలేదు అనే చెప్పాలి. కానీ ఈ వీకెండ్ వసూళ్లతో అయితే ఈ టోటల్ వసూళ్లు క్రాస్ చేయవచ్చు. ఇక ఈ సెన్సేషనల్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా తమన్నా, జాకీ ష్రాఫ్ ఇంకా సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.