Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాని రిజెక్ట్ చేసిన 5 గురు స్టార్ సెలబ్రెటీలు వీళ్లే!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న’అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు.ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.ఏపీలో సినిమా టికెట్ రేటు తగ్గినప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా అన్ని చోట్ల ఎంతో మంచి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ముందుగా ఈ సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం అనుకోలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కంటే ముందుగా ఈ సినిమాలో నటించడానికి మరికొందరి హీరోల పేర్లను తెర పైకి తీసుకు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ హీరోలు ఈ సినిమాలో నటించే లేకపోయారు.పవన్ కళ్యాణ్ కంటే ముందుగా వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోలతో ఈ సినిమా చేయాలని భావించారు. ఒకానొక సమయంలో రవితేజ ఈ సినిమాకి ఫైనల్ అయ్యారని చెప్పారు.

ఇక ఈ సినిమా విషయంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సంప్రదించి కథ చెప్పగానే పవన్ సినిమాకి ఒప్పుకున్నారు.అలా పవన్ కళ్యాణ్ స్థానంలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నటించాల్సి ఉండగా ఈ ముగ్గురు ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇక హీరోయిన్ నిత్యామీనన్ పాత్రలో ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. అయితే సాయి పల్లవి కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. అలాగే సంయుక్త మీనన్ పాత్రలో నటి ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేయగా ఈమె కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొని తర్వాత సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా ఈ సినిమాని ఐదుగురు స్టార్ సెలబ్రిటీలు మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు.