లాక్ డౌన్ చాల పాఠాలు నేర్పింది – హెబ్బా పటేల్

Hebbah Patel

”లాక్‌ డౌన్‌ సమయంలో  ఓపికగా ఎలా ఉండటం, దయగా ఇంకా ఎంత బాగా మెలగాలి.. అనే విషయాలను నేర్చుకున్నాను. దేనికీ ఎంత ప్రాధాన్యమివ్వాలనే విషయాలను నేర్చుకున్నాను. పాజిటివ్‌గా ఉండటం నేర్చుకున్నాను” అంటోంది క్రేజీ తార హెబ్బాపటేల్.

Hebbah Patel
Hebbah Patel

పూర్తిగా సాధారణ పరిస్థితుల గురించి ఇప్పుడు ఆలోచించకపోవడమే బెటర్‌. ఎందుకంటే సాధారణ పరిస్థితులు ఎప్పుడొచ్చినా మార్చి ముందు ఉండే పరిస్థితులైతే రావు. కొత్త సాధారణ పరిస్థితులు, న్యూ ఫేజ్‌ ఆఫ్‌ లైఫ్‌ వస్తుంది. దానికి అలవాటు పడాలంతే.  చేతిలో  ఉన్న సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

పెద్ద కళ్లతో, క్యూట్‌ లుక్ తో యువతరాన్ని అభిమానులుగా మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం కోసం ఏం తింటుందో తెలుసా? ఉదయం లేవగానే చేసే మొదటి పని నీళ్లు తాగడం. దాదాపు లీటరు నీళ్లు గడగడ తాగేస్తా. ఈ మధ్యే నా డైటీషియన్‌ నీళ్లతో పాటూ కాస్త యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ తాగమని సలహా ఇచ్చింది. తనకు  అవకాడో టోస్ట్‌ అంటే చాలా ఇష్టం. కానీ నా డైటీషియన్‌ తినొద్దని చెప్పిందట. అందుకే మానేశా అని చెబుతోంది.  ఆమె ఏం చెబితే అదే నా బ్రేక్‌ ఫాస్ట్‌.

ఒక బౌల్‌ నిండుగా రకరకాల పండ్ల ముక్కలు తింటా. బొప్పాయి, అరటి పండు, ఆపిల్‌, నల్ల ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ గింజలు, ఫిగ్‌ పండ్లు ఇవన్నీ నా ఫ్రూట్‌ బౌల్‌ లో కనిపిస్తాయంటోంది.  ‘అన్నం ఎక్కువ తినను. ఒక కప్పులో కూరలన్నీ కలిపి తింటాను. అలా అయితే ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు తిన్నట్టు అవుతుంది కదా.

డిన్నర్‌లో చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటాను. రైస్‌ ఐటెమ్ మాత్రం తినను.  కేవలం ఆరోగ్యకరమైన ఆహారం వల్లే అందంగా ఉంటారనుకోవద్దు. పాజిటివ్‌ ఆలోచనలతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనసు ఆనందంగా ఉంటే మనిషి అందంగా కనిపిస్తాడు’ అని చెప్పుకొచ్చింది.  క్యారక్టర్ నిడివి కాదు.. ప్రాధాన్య‌తే ముఖ్యం అంటూనే.. అలాంటి పాత్రలు రావడం లేదని కూడా చెబుతోంది హెబ్బాపటేల్.