సీతారామం డిలీట్ సీన్ చూసారా ఎంత బాగుందో.. వైరల్ అవుతున్న వీడియో!

సీతారామం అందమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు తమిళ మలయాళ భాషలలోనే కాకుండా హిందీ భాషలో కూడా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.ఇకపోతే ఈ సినిమా హిందీ వర్షన్ లో సెప్టెంబర్ రెండవ తేదీ విడుదల అయ్యి హిందీలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో భూమిక, సుమంత్, రష్మిక, తరుణ్ భాస్కర్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమాలో ఇతర సెలబ్రిటీలు కూడా సందడి చేయడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక డిలీట్ సీన్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో కనుక చూస్తే ఇంత మంచి డైలాగ్స్ ఉన్నటువంటి ఈ సీన్ సినిమా నుంచి ఎందుకు తొలగించారనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది.

ఇక ఈ వీడియోలో ఏముంది అనే విషయాన్నికొస్తే రష్మిక సీతామహాలక్ష్మి కోసం కాలేజ్ వెతుక్కుంటూ ఒక టాక్సీ లో వస్తుంది. అయితే టాక్సీలో తన పర్స్ పాస్ పోర్ట్ రెండు మర్చిపోయి లోపలికి వెళుతుంది.లోపలికి వెళ్లిన కాసేపటికి ఆమెకు పర్సు గుర్తు రావడంతో బయటకు వస్తుంది అప్పటికి టాక్సీ డ్రైవర్ అక్కడే ఉండడంతో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా.. పర్లేదు ఇప్పటికీ ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటుంది.రష్మిక ఇలా అనడంతో టాక్సీ డ్రైవర్ ఇండియాలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్లే ఉన్నారు నేను మీ పర్సు తీసుకెళ్లి ఇండియా పరువును మీ దేశానికి మీతో పంపించలేను అంటూ డ్రైవర్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇలా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ సన్నివేశాన్ని ఎందుకు తొలగించారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.