పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసి చాలా కాలమైంది. అసలైతే పవన్ కళ్యాణ్ కోసం హరి శంకర్ మరో సినిమా కూడా చేయలేదు. ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా పవర్ స్టార్ తోనే సినిమా చేయాలి అని అతను చాలా కాలం పాటు ఎదురు చూశాడు. అయితే ఊహించిన విధంగా కొన్నిసార్లు కథలో మార్పులు చేయడం కోసం హరీష్ శంకర్ కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
అయితే మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హడావిడిగానే స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్లీ సినిమాకు బ్రేక్ అయితే పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయలలో బిజీగా ఉండడం వలన ఆ సినిమాను తర్వాత ఫినిష్ చేయాలని అనుకున్నాడు. అయితే హరిష్ శంకర్ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలి అని మరోసారి పవన్ తో చర్చలు జరిపి ఒప్పించాడు.
ఇక ఈ సినిమాను అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేయగలిగితే సంక్రాంతికి విడుదల చేసిన అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు విడుదలకు సమయం కుదరకపోతే హరిష్ శంకర్ ప్లాన్ B రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను మార్చి నెలలో మొదటి వారంలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. లేదంటే ఫిబ్రవరి చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.
ఎటు తిరిగి సంక్రాంతి మిస్సయితే ఈ సినిమాను సమ్మర్లో అయినా తీసుకురావాలి అని హరీష్ మరో రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇక సమ్మర్ లో కూడా మరికొన్ని పెద్ద సినిమాలు రానున్నాయి. వాటితో క్లాస్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఓజీ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.