దర్శకుడు హరీష్ శంకర్‌ది ఓ చిత్రమైన పరిస్థితి. మంచి మాటకారి, దుందుడుకు స్వభావం విషయంలో హరీష్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే కదా.! ఇటీవల ‘బలగం’ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్‌లో, ‘వేణూ.. నువ్వు ప్రేక్షకుల్ని ఏడిపించావ్.. మాస్ కమర్షియల్ సినిమాలు చేసి, ప్రేక్షకుల్ని నవ్వించడానికి మేం వున్నాం..’ అనేశాడు.
ఇందులో కొంత ‘క్రిప్టిక్’ వెర్షన్ వుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. గత కొంతకాలంగా తన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని పట్టాలెక్కించడానికి హరీష్ శంకర్ నానా పాట్లూ పడుతున్న సంగతి తెలిసిందే. తొలుత అది ‘భవదీయుడు భగత్ సింగ్’ కాగా, అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా పేరు మార్చుకుంది. పవన్ కళ్యాణ్ హీరో. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది.
రోజులు, నెలలే కాదు.. ఏళ్ళు కూడా గడిచిపోతున్నాయ్. ముందైతే, సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళి ఆ తర్వాత ముదర మాటలు చెబితే బావుంటుందంటూ హరీష్ మీద సెటైర్లు పడుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా. ఇండస్ట్రీలోనూ హరీష్ మీద ఇవే కామెంట్లు పడుతున్నాయట.