ఫైనల్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” పై క్లారిటీ ఇచ్చిన హరీష్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాని అయితే దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా పట్ల గత కొంత కాలం నుంచి రీమేక్ అనే టాక్ పెద్ద ఎత్తున ఆసక్తిగా మారింది.

అది కూడా తమిళ సినిమా “తేరి” రీమేక్ ని టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ మరింత నీరసం అయ్యిపోయారు. అక్కడ నుంచి హరీష్ శంకర్ పై ఓ రేంజ్ లో విరుచుకు పడడం హరీష్ వారిపై సీరియస్ అవ్వడం లాంటివి కూడా జరిగాయి. అయినప్పటికీ ఇది తేరి రీమేక్ సినిమానా కాదా అనేది మాత్రం హరీష్ రివీల్ చేయలేదు.

కానీ ఫైనల్ గా అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓపెన్ అయ్యాడు. ఈ సినిమా తేరి రీమేక్ అని కన్ఫర్మ్ చేస్తూ లేటెస్ట్ ట్వీట్ చేసాడు. ప్రముఖ క్రిటిక్ కి రిప్లై ఇస్తూ రీమేక్ విషయంలో ఎలాంటి ఖండిస్తున్నట్టుగా చెప్పకుండా నన్ను అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ చెప్తూ..

తనని అర్ధం చేసుకోకుండా మాట్లాడే వారికి కూడా సోషల్ మీడియాలో “జవాబుదారీతనం” గా ఫీల్ అవుతున్నారని వారి విషయంలో హరీష్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇక దీనితో ఈ సినిమా రీమేక్ అని తేలిపోవడంతో కామెంట్స్ లో అభిమానులు మరింత వేదన వ్యక్తం చేస్తున్నారు.