పవన్ కళ్యాణ్‌ని వదిలించుకోనున్న హరీష్ శంకర్.?

దేవుడ్ని, భక్తుడు వదిలించుకోగలడా.? ఛాన్సే లేదు.! కానీ, పవన్ కళ్యాణ్‌ని వదిలించుకోవాలనుకుంటున్నాడు హరీష్ శంకర్ అనే చర్చ ఎందుకు జరుగుతున్నట్టు.? సినీ వర్గాల్లో ఈ విషయమై బో ల్డన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ దాదాపు అటకెక్కేసింది. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్, సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అలాగని, రాజకీయాల్లో అయినా ఫుల్ టైమ్ కొనసాగుతున్నారా.? అంటే, అదీ లేదు.

రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది పవన్ కళ్యాణ్ పరిస్థితి.. అంటూ చర్చోపచర్చలు జరుగుతున్న వేళ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటన్న టెన్షన్ హరీష్ శంకర్‌కి ఎందుకు వుండదు.? వుంటుంది.. ఖచ్చితంగా వుండి తీరుతుంది. కానీ, పైకి చెప్పలేడు.

రవితేజతో ఓ సినిమాని హరీష్ శంకర్ అనౌన్స్ చేయబోతున్నాడన్న ప్రచారం ఆ మధ్య జరిగితే, ‘అది ఫేక్ న్యూస్’ అనేశాడు హరీష్. కానీ, కొత్త ప్రాజెక్టు మీదకి హరీష్ వెళ్ళక తప్పని పరిస్థితి. ఎన్నాళ్ళని పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తాడు.?

హరీష్ మాత్రమే కాదు, ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ పరిస్థితి కూడా ఇంతే. ‘హరిహర వీరమల్లు ’దర్శకుడు క్రిష్ కష్టం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.