బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్లు గత వారం నుంచి ఏదో రకంగా వార్తల్లో వైరల్ అవుతూనే వస్తున్నారు. మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అభిజిత్, సోహల్ అఖిల్ హారికలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోహెల్ మెహబూబ్ వీడియో వైరల్ అవ్వడంతో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది.
ఆ వివాదం అంతా ఓ వైపు ఉంటే.. అభిజిత్, హారికల అన్నా చెల్లెళ్ల బంధం అని బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సిస్టర్ అని పిలిచేవాడిని కానీ అది చూపించలేదని అభిజిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇద్దరి గోల ఇలా నడుస్తూ వచ్చింది. అభిజిత్ తనదైన శైలిలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వచ్చాడు. ఈ వారం రోజులు ఏదో రకంగా అభిమానులతో ముచ్చటిస్టూ యాక్టివ్‌గా ఉన్నాడు.
మరో వైపు హారిక తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో బిగ్ బాస్ మెమోరీస్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ టచ్‌లో ఉంది. అయితే ఇక ఈ రోజు నుంచి బిగ్ బాస్ మెమోరీస్ పోస్ట్ చేయను.. ఇదే లాస్ట్ పిక్ అంటూ నాగార్జునతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక మళ్లీ త్వరలోనే కలుస్తా అంటూ హారిక బిగ్ బాస్ జర్నీకి గుడ్ బై చెప్పేసింది. అందరికీ ఏదో ఒక ఆఫర్ వచ్చింది కానీ హారికకు మాత్రం ఎలాంటి అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది.