‘హరిహరవీరమల్లు’ యుద్ద విద్యల్లో శిక్షణ పొందిన పవన్‌!

పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ’హరిహర వీరమల్లు’ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్‌ యుద్థ విద్యల కోసం ’షావోలిన్‌ వారియర్‌ మంక్‌ అకాడవిూ’లో పవన్‌ శిక్షణ తీసుకున్నారు.

ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ హర్ష్‌ వర్మ కూడా ఈ చిత్రం సందడి చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ విూడియాతో మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌ వల్లే నాకు నటనపై ఆసక్తి కలిగింది. పవన్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్‌లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాను. చిన్న విషయాన్ని కూడా నిశితంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. క్షణాల్లో సీన్‌ మార్చినా ఆయన వెంటనే అర్థం చేసుకుంటారు. శిక్షణ ఇచ్చే సమయంలో నాకూ నటనపై ఆసక్తి ఉందని వెల్లడిరచాను. అంతే లుక్‌ టెస్ట్‌ చేయించారు. టెస్ట్‌ ఓకే అయింది. యాక్టింగ్‌ చేయాలనే కోరిక నాలో పుట్టడానికి కారణం ఆయనే. ’హరిహర వీరమల్లు’ క్లైమాక్స్‌ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది.

ప్రస్తుతం దీనితోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తున్నాను‘ అని అన్నారు.టీవల జరిగిన ఓ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఎ.ఎంరత్నం సినిమా షూటింగ్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివరికి సినిమా పూర్తవుతుందని , వచ్చే ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని హావిూ ఇచ్చారు. ఈ చిత్రంలో పవన్‌ సరసన నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.