‘హనుమాన్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకులకు అంజనీపుత్రుడు!

జాంబిరెడ్డి ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్‌’ భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్‌ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రానుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక తెలుగు, తమిళంతో పాటు దాదాపు 12 భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా అదే స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

దానికోసం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను ఎంచుకున్నారు. ఈ నెల7న మెగా ప్రీ`రిలీజ్‌ ఉత్సవ్‌ పేరిట ఈ వేడుక జరుగనుండగా.. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. . ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియాలో అధికారికంగా వెల్లడిస్తూ.. కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.