ఇక ఓటిటిలోకి వస్తోన్న ‘మనుమాన్‌’

టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘హనుమాన్‌’ మహా శివరాత్రి కానుకగా మార్చి 08 నుంచి స్టీమ్రింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ ఎక్స్‌లో ప్రకటించింది.. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది.

ఇదిలావుంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా..? అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పారు మేకర్స్‌. హనుమాన్‌ మూవీ తాజాగా ఓటీటీ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా ఈ చిత్రం స్టీమ్రింగ్‌ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది అంజనాద్రి అనే ఊహా ప్రాంతం.

ఆ వూర్లో హనుమంతు (తేజాసజ్జా) ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖెల్‌ (వినయ్‌రాయ్‌) అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు.

మరా శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్‌ ఏం చేశాడు? మైఖేల్‌ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది? హనుమంతు మైఖేల్‌ ని ఎలా అడ్డుకున్నాడు ? అనేది తెరపై చూడాలి.మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రానున్నట్లు ప్రశాంత్‌ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హనుమాన్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్‌ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్‌ వర్మ వెల్లడించాడు .