బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ డే 1 “హనుమాన్” వసూళ్లు సునామి

ఎప్పుడు ఏ సినిమా ఎలా వండర్ సెట్ చేస్తుందో బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించలేరు. అలాంటి అద్భుతం ఇపుడు మన తెలుగు ఇండస్ట్రీ లో జరిగింది. ఓ చిన్న సినిమా అని తొక్కేద్దాం అని చాలా ప్రయత్నాలు అడ్డంకులు కలిగించిన సంగతి కూడా అందరికీ తెలుసు. మరి ఆ సినిమానే “హనుమాన్”.

దర్శకుడు ప్రశాంత్ వర్మ యువ హీరో తేజ సజ్జతో చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెన్సేషన్ గా ఇండియా వైడ్ మారుతుంది. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో హిందీ మార్కెట్ లో ఇంకా యూఎస్ లో కూడా మాములు హాట్ టాపిక్ గా మారడం లేదు. షాకింగ్ గా దీనితో రిలీజ్ అయ్యిన చిత్రం గుంటూరు కారం ని కూడా డామినేట్ చేస్తూ రెండో రోజు వసూళ్లు యూఎస్ లో రాబడుతుంది.

దీనితో ట్రేడ్ పండితులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఓ బిగ్ ఓపెనింగ్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి హనుమాన్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని రెండో రోజు నుంచి మరింత ఎక్కువ వస్తాయ్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

ఇక యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ 8 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా క్రాస్ చేయగా హిందీ మార్కెట్ రెండున్నర కోట్ల ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక దీనితో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో 12.3 కోట్ల గ్రాస్ ని పైడ్ ప్రీమియర్స్ తో కలిపి రాబడట్టినట్టుగా సమాచారం.

ఇలా మొత్తంగా మొదటి రోజు హనుమాన్ ఒక సంచలన ఓపెనింగ్ ని అందుకుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా రెండో రోజు కొన్ని థియేటర్స్ తగ్గుతాయి అని ఉంది కానీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్ లు హనుమాన్ ని తీసుకుందాం అని చూస్తున్నారట. దీనితో వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చని తెలుస్తుంది.