బికిని వేస్తేనే చూస్తారనుకుంటున్న హన్సిక ..?

పూరి జగన్నధ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది హన్సిక మొత్వానీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తెలుగులో చాలా సినిమాలే చేసింది. అల్లు అర్జున్, రవితేజ, రాం, మంచు హీరోలు నటించిన సినిమాలు, ఎన్.టి.ఆర్., గోపీచంద్, సందీప్ కిషన్.. ఇలా వరసగా పెద్ద హీరోలతో నటించింది. మంచి హిట్స్ కూడా హన్సిక అకౌంట్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్య తెలుగులో కాస్త హవా తగ్గింది. సినిమాలు చేస్తున్నప్పటికి ఆ సినిమాలు బాక్సాఫిస్ వద్ద హిట్ ని సాధించలేకపోతున్నాయి.

Hansika Motwani GIFs are live - tollywood

ఇక హన్సిక తమిళంలో మంచి సినిమాలు చేసింది. తెలుగు తో పాటు తమిళంలో కూడా హన్సిక కి ఇప్పటికి మంచి క్రేజ్ ఉంది. శింబు.. జయం రవి.. అరవింద స్వామి .. ధనుష్ వంటి స్టార్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే తెలుగులో పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ తమిళంలో నయన తార, త్రిష లాంటి వాళ్ళ ని తట్టుకొని నిలబడలేకపోతుందంటున్నారు. కాని అవకాశాలకి మాత్రం కొదవ లేదు .. ఇక్కడో.. అక్కడో సినిమాలు వస్తున్నాయి.

రీసెంట్ గా కోలీవుడ్ లో జయంరవి -అరవింద స్వామి కలిసి నటించిన భోగన్ సినిమాలో హన్సిక నటించింది. ఆ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. అదే టైటిల్ తో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన బోగన్ తెలుగు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో అవకాశాలు వస్తాయన్న ధీమాతో ఉందట హన్సిక. కాగా ఇప్పటి వరకు సక్సస్ ఫుల్ గా హన్సిక నటించిన అన్నీ భాషల్లో కలిపి 50 సినిమాలు కంప్లీట్ చేసింది.

Photos: Hansika Motwani's LEAKED private bikini pictures from her New York  vacation go viral!

హన్సిక కెరీర్ లో నటించిన 50వ సినిమాని రీసెంట్ గా కంప్లీటయిందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఫస్ట్ టైం హన్సిక బికిని వేయడం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా హన్సిక బికిని వేయడం ఇదే మొదటిసారి. బొద్దుగా ఉంటుంది కాబట్టి ఆ అవకాశం రాలేదు. కాని లాక్ డౌన్ సమయంలో తన బాడీని బికిని సైజు కి మార్చేసుకుంది. ఇకపై సినిమాలో అవకాశం ఉంటే బికిని వేయడానికి కూడా రెడీ అన్న సంకేతాలని మేకర్స్ కి పంపుతుందట. అంతేకాదు హన్సిక కెరీర్ 50వ సినిమా మహా సినిమా షూటింగ్ కంప్లీటవగా ఈ సినిమాలోనే బికినితో కనిపించబోతుంది.