టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా అనేక రకాల మలుపులతో మొత్తానికి ఒక ట్రాక్లోకి అయితే వచ్చింది. సినిమా షూటింగ్ ఎన్నిసార్లు ఆగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందా సంక్రాంతికి చెప్పినట్లుగానే విడుదల చేస్తారా లేదా అని అనుమానాలు కూడా చాలానే వచ్చాయి.
కానీ నిర్మాణ సంస్థ హారిక హాసిని మాత్రం ఈ విషయంలో కాన్ఫిడెంట్ గానే కనిపించింది. త్రివిక్రమ్ మహేష్ బాబును ఒప్పించడంలో మధ్యలో కాస్త తడబడినప్పటికీ కూడా మొత్తానికి అయితే ఒక రూట్లోకి తీసుకువచ్చి శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసే పని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తప్పకుండా మార్కెట్లో మంచి బిజినెస్ అయితే చేస్తుంది అని అనిపిస్తోంది.
ఇక బడ్జెట్ ఎంత కాబోతోంది అనే విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక స్థాయిలో ఖర్చుపెడుతున్న నిర్మాతలుగా హారిక హాసిని హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇక ఈ కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్ వలన తప్పకుండా టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది అని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. సినిమా నటీనటులకు అలాగే టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే 120 కోట్లకు పైగా అయినట్లుగా తెలుస్తోంది.
అలాగే పబ్లిసిటీ ప్రింట్ వంటి వాటికోసం మరో 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే సినిమా బ్జడెట్ 220 కోట్ల వరకు అయ్యేటట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా రిటర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ గా దాదాపు 125 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక నాన్ థియేటర్ హక్కులు మొత్తాన్ని కూడా నెట్ ప్లిక్స్ దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి డీల్ సెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఆడియో రైట్స్ నుంచి మరో 20 కోట్లు రాబోతున్నాయి.
ఈ విధంగా సంక్రాంతికి రాబోయే గుంటూరు కారం ఎలా చూసుకున్నా నిర్మాతను టేబుల్ ప్రాఫిట్స్ తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. మరి సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.