వచ్చే ఏడాది సంక్రాంత్రి బరిలో సిద్ధంగా ఉన్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. మరి రీసెంట్ గా వచ్చిన మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ మహేష్ ఫ్యాన్స్ నుంచి కూడా వచ్చింది.
కాగా ఈ చిత్రానికి రీజనల్ గా మన టాలీవుడ్ లో ఏ సినిమాకి కూడా లేని డిమాండ్ నెలకొంది. దీనితో రికార్డు బిజినెస్ ని గుంటూరు కారం క్లాక్ చేస్తుంది రూమర్స్ వచ్చాయి. పైగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకి పైగా బిజినెస్ చేస్తుంది అని టాక్ వచ్చింది.
అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో అయితే లేటెస్ట్ టాక్ ఒకటి వైరల్ గా మారింది. దీనితో ఈ చిత్రం ఒక్క తెలుగు స్టేట్స్ బిజినెస్ గా ఫైనల్ ఫిగర్ 115 కోట్లకి అమ్ముడుపోయిందట. ఇది రీజనల్ సినిమాల హిస్టరీలోనే అత్యధికం. దీనితో గుంటూరు కారం తో మహేష్ బాబు రిలీజ్ కి ముందే ఆల్ టైం రికార్డు పెట్టాడని చెప్పాలి.
ఇక మహేష్ కి సంక్రాంతి ఎలాగో అచ్చొచ్చిన టైం పైగా ఈసారి త్రివిక్రమ్ తో పాటుగా రావడంతో క్రేజ్ ఇంకా హై లో ఉంది. ఇక మొత్తంగా అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లోనే ఈ చిత్రం 200 కోట్లకుపైగా గ్రాస్ ని రాబడితే తప్ప గట్టెక్కదు. మరి చూడాలి ఈ సినిమా విషయంలో ఏమవుతుంది అనేది. కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల లు హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.