చిన్నోడికి పెద్దోడి మాస్ వార్నింగ్.! గుంటూరు కారం వర్సెస్ సైంధవ్.!

‘చూద్దాం ఎన్ని థియేటర్లు వస్తాయో. మాకేమీ ఫరక్ పడదు. తక్కువ థియేటర్లు వచ్చినా ఏం బాధ లేదు. ఎక్కడ సినిమా చూడాలో అక్కడే చూస్తాం..’ అంటూ సీనియర్ నటుడు, విక్టరీ వెంకటేష్ తాజాగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ హీరో వెంకటేష్ సినిమాకి సైతం ఈ సంక్రాంతి సీజన్‌లో సరిగ్గా థియేటర్లు దొరకని పరిస్థితి. దానిక్కారణం ‘గుంటూరు కారం’ సినిమానే. సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమా ఇది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి థియేటర్ల విషయమై నిర్మాతల మధ్య పంచాయితీ వుండాలి. కానీ, హీరోల అభిమానుల మధ్య పంచాయితీ నడుస్తోంది. వెంకటేష్, మహేష్ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో పెద్దోడు, చిన్నోడుగా ఈ ఇద్దరూ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

మామూలుగా అయితే మహేష్, వెంకటేష్ మధ్య సన్నిహిత సంబంధాలు బాగానే వుంటాయ్. కానీ, ఈ సంక్రాంతి సినిమాల ఫైట్, థియేటర్ల లొల్లి నేపథ్యంలో వెంకటేష్ కొంత అప్‌సెట్ అయినట్లే కనిపిస్తోంది. మహేష్ మీద అని కాదుగానీ, ‘గుంటూరు కారం’ మీద వెంకటేష్ అసహనంతోనే వున్నారు.

మరి, ఈ విషయమై మహేష్ ఏమైనా తన నిర్మాతలతో చర్చిస్తాడా.? పెద్దోడికి కాస్తంత ఉపశమనం కల్గించేలా చేస్తాడా.? వేచి చూడాల్సిందే.