అక్కడ డిజాస్టర్ దిశగా “గుంటూరు కారం”

టాలీవుడ్ టైర్ 1 టాప్ హీరోస్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రీసెంట్ అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” తో అయితే మళ్ళీ ఈ సంక్రాంతికి పలకరించేందుకు వచ్చాడు. కాగా ఈ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ వచ్చింది. మెయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా అనేసరికి ఆ అంచనాలు పీక్ కి వెళ్లాయి.

కానీ సీన్ కట్ చేస్తే సినిమా ఏమో అనుకున్న రేంజ్ లో లేదు. పైగా టాక్ కూడా చాలా తేడాగా వచ్చింది. అయినా కూడా వసూళ్లు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. కాగా ఈ వసూళ్లు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఓ చోట మాత్రం గుంటూరు కారం డిజాస్టర్ గా నిలుస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ సినిమాకి నార్త్ అమెరికా రీజన్ లో దాదాపు 5 మిలియన్ డాలర్స్ మేర బిజినెస్ ని చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం 3 మిలియన్ మార్క్ అందుకోవడానికే చాలా కష్టపడుతుంది. దీనితో అక్కడ మాత్రం సినిమా గట్టెక్కే అవకాశమే లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

సో అక్కడ గుంటూరు కారం డిజాస్టర్ గానే మిగిలిపోతుంది అని చెప్పక తప్పదు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటించగా థమన్ ఎస్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ రాధాకృష్ణ నిర్మాణం వహించారు.