ఇండస్ట్రీ టాక్ : “గుంటూరు కారం” బాహుబలి 2 ని కొట్టేసిన మహేష్? 

టాలీవుడ్ సినిమా దగ్గర చాలా మంది స్టార్ లు ఉండొచ్చు కానీ రీజనల్ గా మాత్రం కొందరి హీరోలది మాత్రమే హవా ఉంటుంది అని చెప్పాలి. కాగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలాంటి పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా రికార్డులు పెట్టె అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు.

మరి మహేష్ బాబు ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ 28వ సినిమా అంతే కాకుండా వీరి ఇద్దరై కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాని అయితే తాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మామూలుగానే మహేష్ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి.

మరి ఈసారి అలాంటిది మహేష్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అంటే అవి ఇంకో లెవెల్ అని చెప్పొచ్చు. అందుకే గుంటూరు కారం కి తెలుగు రాష్ట్రాల్లో మాములు హైప్ ఇప్పుడు లేదు. దీనితో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ రికార్డు కొట్టినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 చిత్రానికి 122 కోట్ల మేర బిజినెస్ జరిగితే ఇప్పుడు ఒక్క గుంటూరు కారం బిజినెస్ 125 కోట్లు అన్నట్టుగా తెలుస్తుంది. దీని బట్టి గుంటూరు కారం పై ఉన్న హైప్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.