వీడియో టాక్ : “గుంటూరు కారం” రెండో సాంగ్ ఎలా ఉందంటే.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్స్ గా ఇది నిలుస్తుందా లేదా అనేది అందరిలో ఉంది.

అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది మాస్ సాంగ్ అయితే దీని తర్వాత క్లాస్ సాంగ్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఓ మై బేబీ అంటూ మహేష్ బాబు మరియు యంగ్ హీరోయిన్ శ్రీలీల మధ్య నడిచే ఒక రొమాంటిక్ మెలోడీలా దీనిని ప్లాన్ చేసినట్టుగా విన్నాక అనిపిస్తుంది.

థమన్ అయితే ఒక క్లీన్ బీట్స్ ని అందించాడు అని చెప్పొచ్చు. మధ్యలో మహేష్ ఫ్యాన్స్ కి నచ్చేలా తన పాత సినిమా టైటిల్ కూడా కనిపించడం బాగున్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం సాంగ్ విన్న వెంటనే నచ్చేసే రేంజ్ లోని లేదు అలాగని బాగాలేదు అని అనలేదు. మీడియం గా అయితే సాంగ్ ఉంది.

మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే రేంజ్ హిట్ సాంగ్స్ లా కూడా అనిపించలేదు. మరి ఉండగా ఉండగా ఏమన్నా సాంగ్ ని మ్యూజిక్ లవర్స్ పెద్ద హిట్ చేస్తారేమో చూడాలి. కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటించగా ఈ రానున్న సంక్రాంతి కానుకగా సినిమా గ్రాండ్ గా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. 
Oh My Baby Lyrical Song | Guntur Kaaram Songs | Mahesh Babu | Trivikram | Thaman S |S. Radha Krishna