హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ లకి మంచి ఆదరణ ఉంటుంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించే సూపర్ హీరో చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. ఈ సిరీస్ లో ఒకటి గార్డియన్ అఫ్ గెలాక్సీ. ఈ మూవీ పార్ట్ 3 ప్రస్తుతం ప్రేక్షకుల మందికి వచ్చింది. ఇక మార్వెల్ సిరీస్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ పార్ట్ 3 లో కూడా ఉండడం విశేషం.
కథలోకి వెళ్తే రాకెట్ పై వరుస ఎటాక్ లతో చావు బతుకుల మధ్య ఉంటుంది. గార్డియన్ ఆఫ్ గెలాక్సీ టీం దానిని తిరిగి ఎలా రక్షించారు అనేది సింపుల్ గా ఈ మూవీ స్టోరీ లైన్. ఈ సిరీస్ గురించి ముందుగా చెప్పుకోవాలంటే కామెడీ. అందులోని సూపర్ హీరో పాత్రలు చేసే కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
పార్ట్ 3 లో కూడా అలాంటి కామెడీకి కొదవలేదు. అలాగే మార్వెల్ సిరీస్ లలో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సూపర్ హీరోలు చేసే సాహసాలు ప్రేక్షకులకు కావలసినంత థ్రిల్ ఇస్తూ ఉంటాయి. ఇందులో కూడా అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అలాగే రాకెట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.
ఇక ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఆద్యంతం గార్డియన్ ఆఫ్ గెలాక్సీ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. అందుకే ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యేసరికి ప్రేక్షకులు హ్యాపీ మూడ్ తో బయటకి వస్తారు.
మార్వెల్ సిరీస్ నుంచి వచ్చి చిత్రాలలో అతి తక్కువ బజ్ తో రిలీజ్ అయిన మూవీ ఇదే కావడం విశేషం. అయితే స్లోఫేస్ లో వచ్చి ప్రేక్షకులను ఈ మూవీ భాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. లాంగ్ రన్ లో గార్డియన్ ఆఫ్ గెలాక్సీ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.