గాసిప్స్ – రీఎంట్రీ ఇవ్వబోతున్న ఈ మెగా హాట్ బ్యూటీ.!

Neha Sharma Latest Clicks

తెలుగు సినిమా దగ్గర తమ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రీసెంట్ గా మాత్రం గడిచిన మూడేళ్ళలోనే మన టాలీవుడ్ లో హీరోయిన్స్ గా వచ్చి ఆనతి కాలంలోనే భారీ స్టార్డం అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న వారిలో యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, కృతి శెట్టి అలాగే సంయుక్త మీనన్ లు హవా చూపిస్తున్నారు.

అయితే టైం మెషిన్ లో కొంచెం వెనక్కి వెళితే టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాస్ హీరోయిన్ నేహా శర్మ కోసం ఇపుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ నేహా శర్మ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అయితే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి.

నేహా శర్మ తెలుగులో కేవలం రెండంటే రెండే సినిమాలు చేసింది. ఇక ఈ తర్వాత హిందీలోనే సెటిల్ అయిపోయింది. అయితే హిందీలో కూడా ఆమెకి భారీ స్టార్డం ఏమి రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఇక ఫైనల్ గా ఇపుడు మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈమె అయితే రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాకి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మళ్ళీ ఈ మెగా హాట్ బ్యూటీని చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో చూడబోతున్నాం అని చెప్పాలి.