గాసిప్స్ : 1000 కోట్ల దర్శకునితో పవన్??

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు సినిమాలతో పాటుగా పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా పవన్ సినిమాల కోసం మాట్లాడుకున్నట్టు అయితే భారీ లైనప్ ని తాను చేసుకున్నాడు. ఓజి, హరిహర వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలు పవన్ లైనప్ లో ఉండగా..

వాటితో పాటుగా దర్శకుడు సురేందర్ రెడ్డి తో కూడా ఓ సినిమా ఓకే అయ్యి ఉంది. కాగా ఈ చిత్రాలతో పాటుగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంటూ కొన్ని గాసిప్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఈ సరికొత్త ప్రాజెక్ట్ ఏకంగా దర్శకుడు అట్లీతో అంటున్నారు. కాగా అట్లీ రీసెంట్ గా చేసిన చిత్రం “జవాన్” 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే.

దీనితో కోలీవుడ్ నుంచి తాను మొదటి 1000 కోట్ల దర్శకుడిగా నిలవగా ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా అంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పవన్ కి చెందిన కొన్ని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఆ వార్తలు అన్నీ అవాస్తవం అని వారు కన్ఫర్మ్ చేయగా ఓ పక్క అయితే అట్లీతో సినిమాకి కూడా గురూజీ త్రివిక్రమ్ ప్రమేయం ఉంది అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఇవేవి ఇప్పుడప్పుడే అయ్యే సీన్ మాత్రం ఇప్పుడు లేదు. ముందు ఎలక్షన్ అవ్వాలి నెక్స్ట్ సినిమాలు కంప్లీట్ చెయ్యాలి ఆ తర్వాతే ఒకవేళ ఉంటే ఈ సినిమా ఉండాలి.