గాసిప్స్ : “NBK108” కథ ఇదేనా.?

లేటెస్ట్ గా టాలీవుడ్ లో మాస్ హిట్ కొట్టిన సీనియర్ హీరోస్ లో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. వీరసింహ రెడ్డి తో బాలయ్య తన కెరీర్ లోనే భారీ హిట్ కొట్టగా లాస్ట్ సినిమా అఖండ తో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్ లు బాలయ్య ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నారు.

మరి ఈ నెక్స్ట్ సినిమాగా అయితే దర్శకుడు అనిల్ రావిపూడి తో బాలయ్య తన కెరీర్ 108వ సినిమా చేయనున్నారు. కాగా ఈ సినిమా సూపర్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఇప్పుడు షూటింగ్ కూడా స్వింగ్ లో నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా కథపై ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య రెండు కాకుండా మూడు గెటప్స్ లో కనిపిస్తారట. అలాగే యుక్త వయసులో చేసిన ఓ తప్పు మూలాన కొన్నేళ్ల పాటు జైల్లో హీరో పాత్ర గడిపి బయటకొచ్చాక ఏం చేస్తుంది అనేది సినిమాలో లైన్ అన్నట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ కోణంలో బాలయ్య రోల్ లో పలు షేడ్స్ లో ఉంటుంది అని ఇప్పుడు సమాచారం. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించనుంది. ఇంకా ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.